Saturday, February 10, 2018

మిత్రధర్మంపై మాట్లాడే హక్కు తెదేపాకు లేదు : భాజపా


మిత్రధర్మంపై మాట్లాడే హక్కు తెదేపాకు లేదు : భాజపా
స్టోన్‌హౌస్‌పేట, న్యూస్‌టుడే : విశ్వసనీయత, నీతి, నిజాయతీ, మిత్రధర్మం గురించి మాట్లాడే హక్కు తెదేపా నాయకులకు లేదని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని జిల్లా భాజపా కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జన్మభూమి నెల్లూరుకు, కన్నతల్లి లాంటి భాజపాకు జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిజాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను చేపట్టిన ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ సామర్థ్యాన్ని పత్రికలు ఘోషించాయని, ప్రాజెక్టు విషయంలో డొల్లతనాన్ని ప్రజలు చూస్తున్నారన్నారు. భాజపాకు రెండు కళ్ల సిద్ధాంతాలు లేవన్నారు. ఈ సమావేశంలో ఆపార్టీ నాయకులు మొద్దు శ్రీనివాసులు, కరణం భాస్కర్‌, కోసూరి బాలయ్యగౌడ్‌, శ్యాం, తదితరులు పాల్గొన్నారు.


BJP Ideology: Hindutva, Hindu nationalism,Integral humanism Conservatism,National conservatism,Social conservatism Economic nationalism,Right-wing populism President: Amit Shah Parliamentary Chairperson: Narendra Modi Founded: 6 April 1980

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Share