c : సురేష్‌రెడ్డి
సూళ్లూరుపేట, న్యూస్‌టుడే : జిల్లాలో పూర్తిస్థాయిలో ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించతలపెట్టిన దుగరాజపట్నం ఓడరేవు భూసేకరణలో ఎందుకు జాప్యం చేస్తున్నారని భాజపా రాష్ట్ర నేత సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన ఆదివారం సూళ్లూరుపేటకు విచ్చేశారు. ఈ సందర్భంగా భాజపా నేతలు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ 2018 నాటికి దుగరాజపట్నం ఓడరేవు మొదటి దశ పనులు పూర్తికావల్సి ఉందన్నారు. అయితే ఇంతవరకు భూసేకరణ జరగలేదని ఆయన పేర్కొన్నారు. విభజన హామీ ఇచ్చి నాలుగేళ్లు అవుతున్నా.. ఎందుకు కాలయాపన చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన హామీలో లేని కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వే కోచ్ ప్యాక్టరీ, తదితర వాటికి సంబంధించిన ప్రకటనలు వస్తున్నాయన్నారు. దుగరాజపట్నం ఓడరేవు సాధన కోసం ఈనెల 10న నాయుడుపేట ఆర్డీవో కార్యాలయం వద్ద భాజపా ఆధ్వర్యాన ఆందోళన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు.
BJP Ideology: Hindutva, Hindu nationalism,Integral humanism Conservatism,National conservatism,Social conservatism
Economic nationalism,Right-wing populism
President: Amit Shah
Parliamentary Chairperson: Narendra Modi
Founded: 6 April 1980
No comments:
Post a Comment